News November 18, 2024
నర్సీపట్నంలో ఆదివారం అర్ధరాత్రి హత్య
నర్సీపట్నం మున్సిపాలిటీ కొత్త వీధిలో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. కొత్తవీధి శివారు జంక్షన్లో ఓ వ్యక్తిని హత్య చేశారు. సర్వసిద్ధి నాగేశ్వరరావు అనే వ్యక్తి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హత్యకు పాల్పడినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో డిఎస్పీ మోహన్, టౌన్ సీఐ గోవిందరావు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.
Similar News
News December 9, 2024
విశాఖ-బనారస్ ఎక్స్‌ప్రెస్ 22న రద్దు
విశాఖ-బనారస్ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 22వ తేదీన రద్దు చేస్తున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. సోరంటోలి చౌక్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 23న బనారస్-విశాఖ ఎక్స్‌ప్రెస్ కూడా రద్దు చేశామని తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
News December 9, 2024
పాడేరు: తల్లిదండ్రులపై కుమారుల దాడి
అల్లూరి జిల్లా పాడేరులో శనివారం రాత్రి పూడి శ్రీనివాస్, వరలక్ష్మి వారి కుమార్తె వద్దకు వెళ్లారు. తిరిగి ఇంటికి రాగానే పెద్ద కుమారుడు, కోడలు, చిన్న కుమారుడు ముగ్గురు కలిసి ఇనుప రాడ్లతో తలపై కొట్టారని, కోడలు గుండెపై తన్నిందని ఆరోపించారు. చుట్టుపక్కల వాళ్లు రాకపోతే తమను హత్య చేసేవారని ఆవేదన చెందారు. కుమార్తెకు డబ్బులు ఇస్తున్నారని ఆరోపిస్తూ దాడి చేశారని పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు.
News December 8, 2024
ఎడ్యుకేషన్ హబ్‌గా ఏపీ: హోంమంత్రి అనిత
సీఎం చంద్రబాబు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో ఏపీ ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం పట్ల ఆమె ‘X’ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రెండు స్కూల్స్ మాత్రమే మంజూరైతే కూటమి ప్రభుత్వ పాలనలో ఏడాదిలో 8 స్కూల్స్ మంజూరైనట్లు తెలిపారు.