News September 2, 2024
నర్సీపట్నంలో కొట్లాటకు దారి తీసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

నర్సీపట్నంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ రెండు వర్గాల మధ్య కొట్లాటకు దారి తీసిందని టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఒక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు అవతల వర్గం వారిపై చేసిన వ్యాఖ్యల వల్ల జోగినాథునిపాలెం, బీసీ కాలనీ ప్రాంతాలలో ఇరు వర్గాలు కొట్టుకున్నాయని తెలిపారు. కొట్లాటలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. ఇరు వర్గాలకు చెందిన 11 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News December 1, 2025
విశాఖ: ఆర్కే బీచ్‌లో ప్రమాద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

ఆర్కే బీచ్‌కు వచ్చే పర్యాటకుల భద్రత దృష్ట్యా నగర పోలీసులు చర్యలు చేపట్టారు. త్రీ టౌన్ సీఐ పైడయ్య ఆధ్వర్యంలో బీచ్‌లోని ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. “ఇచ్చట స్నానం చేయడం ప్రమాదకరం” అని హెచ్చరిస్తూ, అత్యవసర సహాయం కోసం సీఐ, టోల్ ఫ్రీ నంబర్లను (1093, 112) పొందుపరిచారు. పర్యాటకులు సముద్రంలో లోతుగా వెళ్లవద్దని పోలీసులు సూచించారు.
News December 1, 2025
విశాఖ జిల్లాలోని స్కూళ్లలో పిల్లలకు ఉదయం స్నాక్స్

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారంలో మూడు రోజుల మార్నింగ్ న్యూట్రిషన్ అందించేందుకు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అక్షయపాత్ర సహకారంతో కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. తొలి విడతగా 178 పాఠశాలల్లో ప్రారంభించి, త్వరలో అన్ని పాఠశాలలకు విస్తరించనున్నారు. ఉదయం అల్పాహారం లేక తరగతులకు వచ్చే పిల్లలకు చిరుతిండ్లు వంటివి అందించనున్నారు.
News December 1, 2025
అర్జీలు రీ-ఓపెన్ కాకూడదు: అధికారులకు కలెక్టర్ ఆదేశం

విశాఖ కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా 237 వినతులు స్వీకరించారు. ఒకే సమస్యపై అర్జీలు మళ్లీ ‘రీ-ఓపెన్’ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులతో తప్పనిసరిగా ఫోన్లో మాట్లాడాలని సూచించారు. వచ్చిన వినతుల్లో రెవెన్యూ, జీవీఎంసీ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.


