News February 18, 2025

నర్సీపట్నంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్

image

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రెండు రోజుల నుంచి తన స్వగ్రామమైన నర్సీపట్నంలో సందడి చేస్తున్నారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ ఇంటికి తల్లిని చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా నర్సీపట్నం పరిసర గ్రామాలకు చెందిన అభిమానులు ఆయన్ను కలిసి ఫొటోలు తీసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణ రాజు సోమవారం ఆయనతో భేటీ అయ్యారు.

Similar News

News January 6, 2026

సూళ్లూరుపేట: ఇది ప్రకృతి హీరో..!

image

ఉప్పునీరు, చిత్తడి నేలలతో పులికాట్ జీవాన్ని దాచుకుంటుంది. ఆ జీవాన్ని ముందుగా గుర్తించేది నల్ల తల కొంగే. చెరువు అంచుల్లో పురుగులు, చిన్న జీవులను తింటూ పొలాలకు కనిపించని రక్షణ ఇస్తుంది. ఈ పక్షి లేకపోతే పురుగులు పెరుగుతాయి, పంట సమతుల్యత కోల్పోతుంది. మనుషులు గమనించకపోయినా, నల్ల తల కొంగ పులికాట్ జీవచక్రాన్ని నిలబెడుతుంది. అందుకే ఇది శబ్దంతో కాదు, అవసరంతో ప్రకృతి హీరో అవుతుంది.
#FLEMMINGOFESTIVAL

News January 6, 2026

BREAKING: విజయ్‌కు సీబీఐ నోటీసులు

image

తమిళనాడు కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్, స్టార్ హీరో విజయ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న టీవీకే సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే.

News January 6, 2026

ఆకివీడు: షైనీ ప్రతిభను మెచ్చి కేంద్ర మంత్రి అభినందనలు

image

అంతర్జాతీయ స్థాయిలో మల్టీ టాలెంటెడ్ అవార్డుతో పాటు ఇటీవల ‘నంది’ అవార్డు గెలుచుకున్న ఆకివీడు మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ శిష్యురాలు ఘంటా షైనీని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అభినందించారు. మంగళవారం ఆయనను కలిసిన షైనీని మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, ప్రాంతానికి గర్వకారణంగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.