News February 18, 2025
నర్సీపట్నంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రెండు రోజుల నుంచి తన స్వగ్రామమైన నర్సీపట్నంలో సందడి చేస్తున్నారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ ఇంటికి తల్లిని చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా నర్సీపట్నం పరిసర గ్రామాలకు చెందిన అభిమానులు ఆయన్ను కలిసి ఫొటోలు తీసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణ రాజు సోమవారం ఆయనతో భేటీ అయ్యారు.
Similar News
News March 27, 2025
పెరిగిన బంగారం ధరలు

వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.82,350లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగడంతో రూ.89,840 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,11,000గా ఉంది.
News March 27, 2025
పాలమూరు: దంపతులు మృతి.. ఆ ఊరిలో విషాదం

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందడంతో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సక్కుబాయి(40), పాండు(45) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధి కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ నలుగురు అనాథలుగా మారారు.
News March 27, 2025
ఖమ్మం జిల్లాలో బుధవారం నాటి ముఖ్యాంశాలు

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పదో తరగతి పరీక్షలు ∆} సత్తుపల్లిలో కాంగ్రెస్ నేత దయానంద్ పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వియ్యం బంజర సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు