News April 6, 2025
నర్సీపట్నం: ‘అధికారులతో స్పీకర్ సమీక్ష’

శనివారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రోడ్లు, భవనాల శాఖ ఎస్ఈ సుధాకర్, పర్యాటక శాఖ అధికారి కె.రమణలతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నర్సీపట్నం ట్యాంక్ బండ్ వద్ద విగ్రహాలు, ఆధునిక లైటింగ్, భూ సౌందర్యం (ల్యాండ్ స్కేపింగ్), బ్యూటిఫికేషన్ అలంకరణతో కూడిన పూల తోటలు తదితర అంశాలపై చర్చించారు. ఆర్డీవో వివి.రమణ, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర పాల్గొన్నారు.
Similar News
News November 24, 2025
ADB అధికారులతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్

ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీని రేపట్లోగా పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్మితమైన 982 రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తెలిపారు. దీనిపై స్పందించిన ఉపముఖ్యమంత్రి అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలన్నారు.
News November 24, 2025
రేపు కామారెడ్డి జిల్లాకి టీజీఎంబీసీడీసీ అధికారుల రాక

రేపు జిల్లాకి తెలంగాణ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGMBCDC) రాష్ట్ర అధికారులు రాబోతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. సోమవారం అయన మాట్లాడుతూ.. జిల్లాలోని MBC కులాల సామాజిక ఆర్థిక స్థితి మీద వారు సర్వే నిర్వహిస్తారన్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి అధ్యక్షతన రేపు కలెక్టర్ కార్యాలయంలోని రూమ్ నెంబర్ 226లో ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
News November 24, 2025
కామారెడ్డి: కానిస్టేబుల్ కుటుంబాలకు చెక్కులు అందజేత

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ రవికుమార్, బుచ్చయ్య కుటుంబాలకు పోలీస్ శాలరీ ప్యాకేజీ కింద ఒక్కో కుటుంబానికి రూ.కోటి విలువ గల చెక్కులను జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఎస్బీఐ రీజినల్ మేనేజర్ బృందంతో కలిసి సోమవారం అందజేశారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.


