News February 7, 2025
నర్సీపట్నం యాక్సిడెంట్లో మరణించిన ఉద్యోగి వివరాలు

నర్సీపట్నంలో శుక్రవారం ఉదయం బస్సు కిందపడి <<15385488>>మరణించిన <<>>ఫారెస్ట్ ఉద్యోగి వివరాలు తెలిసాయి. కొయ్యూరు మండలం మర్రుపాక సెక్షన్ ఆఫీసర్‌గా ఆర్.పుట్టన్న విధులు నిర్వహిస్తున్నారు. నర్సీపట్నంలో నివాసముండే పుట్టన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం విధులకు బయలుదేరిన పుట్టన్న రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరిలో విషాదం నిలిపింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది విచారణ వ్యక్తం చేశారు.
Similar News
News December 5, 2025
సంగారెడ్డి డీపీవో సాయిబాబా సస్పెండ్

సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) సాయిబాబాపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు.
News December 5, 2025
సీఎం స్టాలిన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ఆయనకు ఆహ్వాన పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్టాలిన్‌తో రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించారు.
News December 5, 2025
SVU: పరీక్ష ఫలితాలు విడుదల.!

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ ఏడాది M.L.I.Sc 3, 4 M.A హిస్టరీ, సోషల్ వర్క్, హ్యూమన్ రైట్స్ ఉమెన్ స్టడీస్ మొదటి సెమిస్టర్ పరీక్షలు, దూరవిద్య విభాగం (SVU DDE) ఆధ్వర్యంలో B.LI.Sc పరీక్షలు జరిగాయి. ఈ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.


