News February 7, 2025
నర్సీపట్నం యాక్సిడెంట్‌లో మరణించిన ఉద్యోగి వివరాలు

నర్సీపట్నంలో శుక్రవారం ఉదయం బస్సు కిందపడి <<15385488>>మరణించిన <<>>ఫారెస్ట్ ఉద్యోగి వివరాలు తెలిసాయి. కొయ్యూరు మండలం మర్రుపాక సెక్షన్ ఆఫీసర్‌గా ఆర్.పుట్టన్న విధులు నిర్వహిస్తున్నారు. నర్సీపట్నంలో నివాసముండే పుట్టన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం విధులకు బయలుదేరిన పుట్టన్న రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరిలో విషాదం నిలిపింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది విచారణ వ్యక్తం చేశారు.
Similar News
News April 19, 2026
గురుకుల ఆర్సీఓను తొలగించాలి: లంబాడా హక్కుల పోరాట సమితి

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రాచలం గురుకుల ఆర్సీఓను వెంటనే విధుల్లోంచి తొలగించాలని లంబాడా హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. 2023-24 నియామకాలు, బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగాయని, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఐటీడీఏ ముట్టడికి దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.
News April 19, 2026
చిత్తూరు: చెరువులో పడి ఇద్దరు మహిళలు మృతి

గుడిపల్లి (M) కనుమనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో గుడ్డలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బేబీ (19), దుర్గ (21) మృతి చెందారు. వరుసకు అక్క చెల్లెలు అయిన బేబీ, దుర్గ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
News April 19, 2026
అల్లికలతో వ్యసనాలకు చెక్!

స్మోకింగ్, గోళ్లు కొరకడం, గంటల తరబడి మొబైల్ చూడటం వంటి వ్యసనాల నుంచి బయటపడటానికి అల్లికలు మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఖర్చుతో కూడిన థెరపీలు, కౌన్సెలింగ్‌లు అవసరం లేదంటున్నారు. ‘అల్లికలు అందంగా ఉండనక్కర్లేదు. చేతులు, కళ్ల కదలికల వల్ల పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ యాక్టివేటై శరీరం రిలాక్స్ అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలూ తగ్గుతాయి’ అని పేర్కొంటున్నారు.


