News February 10, 2025
నర్సీపట్నం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నర్సీపట్నం శివారు సుబ్బారాయుడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు నర్సీపట్నం టౌన్ సీఐ గోవిందరావు సోమవారం తెలిపారు. మాకవరపాలెం మండలం చంద్రయ్యపాలెంకు చెందిన వంటాకుల గంగాధర్ (28) ఆదివారం నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో జరిగిన పండుగకు వెళ్లి బైక్‌పై తిరిగి వస్తూ సుబ్బారాయుడుపాలెం వద్ద చెట్టును ఢీకొట్టినట్లు చెప్పారు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందినట్లు వెల్లడించారు.
Similar News
News November 23, 2025
మొక్కజొన్న, వేరుశనగలో బోరాన్ లోప లక్షణాలు

☛ మొక్కజొన్న: లేత ఆకుల పరిమాణం తగ్గి హరిత వర్ణాన్ని కోల్పోతాయి. జల్లు చిన్నవిగా ఉండి మొక్క నుంచి బయటికి రావు. బోరాన్ లోప తీవ్రత అధికంగా ఉంటే కండెలపై గింజలు వంకర్లు తిరిగి చివరి వరకు విస్తరించవు. దీని వల్ల దిగుబడి, సరైన ధర తగ్గదు. ☛ వేరుశనగ: లేత ఆకులు పసుపు రంగులోకి మారి దళసరిగా కనిపిస్తాయి. బీజం నుంచి మొలకెత్తే లేత ఆకు కుచించుకొని రంగు మారుతుంది.
News November 23, 2025
హనుమకొండ మోడల్ బస్టాండ్ నిర్మాణంపై మల్లగుల్లాలు!

HNKలో మోడల్ బస్టాండ్ నిర్మాణం మళ్లీ అనిశ్చితిలోకి వెళ్లింది. రూ.80 కోట్ల వ్యయంతో 5 అంతస్తుల భవన సముదాయం, ఆర్ఎం కార్యాలయం, షాపింగ్ కాంప్లెక్స్, సినిమా హాల్, వీఐపీ లాంజ్ వంటి ఏర్పాట్లతో కుడా అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. అయితే తాజా సమావేశాల్లో ఆర్టీసీ ఉన్నతాధికారులు భవనాన్ని తామే నిర్మిస్తామని ప్రకటించడంతో కుడా నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకుంది. దీంతో ప్రాజెక్ట్ ముందడుగు తాత్కాలికంగా నిలిచాయి.
News November 23, 2025
హనుమకొండ: 25-29 వరకు ఇన్‌స్ట్రక్టర్లకు శిక్షణ

జిల్లాలో ప్రీప్రైమరీ విద్యా బోధన నాణ్యతను మెరుగుపర్చేందుకు 45 పాఠశాలల నుంచి ఎంపికైన 45 ఇన్‌స్ట్రక్టర్లకు ఈ నెల 25-29 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో జరిగే ఈ శిక్షణలో బోధనా నైపుణ్యాలు, తరగతి నిర్వహణ, పర్యవేక్షణ అంశాలపై డీఆర్పీలు మార్గదర్శనం చేయనున్నారు. డిసెంబర్ 1న హెచ్ఎంలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు కోర్సు డైరెక్టర్ డా.బండారు మన్మోహన్ తెలిపారు.


