News March 8, 2025
నర్సీపట్నం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్న కాలనీకి చెందిన పెదిరెడ్ల జగదీశ్ అనే యువకుడు శుక్రవారం అర్ధరాత్రి చెట్టుపల్లి గ్రామం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ ఎస్‌ఐ రాజారావు తెలిపారు.
Similar News
News January 19, 2026
పోలాండ్ మంత్రికి ముఖం మీదే ఇచ్చిపడేసిన జైశంకర్!

పోలాండ్ విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్‌స్కీతో భేటీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ఉగ్రవాదంపై పోలాండ్ జీరో టాలరెన్స్ ప్రదర్శించాలని, భారత్ పొరుగు దేశాల్లో (పరోక్షంగా పాక్‌లో) ఉగ్రవాదానికి సపోర్ట్ చేయొద్దని గట్టిగా చెప్పారు. గత ఏడాది పాక్ పర్యటనకు వెళ్లిన సికోర్‌స్కీ కశ్మీర్‌పై పాక్ వాదానికి మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జైశంకర్ నేరుగా చురకలంటించారు.
News January 19, 2026
విశాఖ: ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం

ఇంటర్ ప్రాక్టికల్స్, థియరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం విశాఖ కలెక్టరేట్ మీటింగు హాలులో ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ప్రతీ పరీక్షా కేంద్రానికి ఒక ఛీప్ సూపరింటెండెంట్, సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. 85 కేంద్రాల్లో థియరీ, 138 కేంద్రాల్లో ప్రాక్టికల్స్‌కు 81 వేల మంది హాజరుకానున్నారు.
News January 19, 2026
భార్యాభర్తలకు ఒకే ITR.. బడ్జెట్‌లో ప్రకటన?

బడ్జెట్ 2026లో మ్యారీడ్ కపుల్ కోసం ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్ విధానాన్ని తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం భార్యాభర్తలను ఒకే ఆర్థిక యూనిట్‌గా పరిగణించి ఉమ్మడి ఆదాయంపై పన్ను లెక్కిస్తారు. ఈ విధానం వస్తే దంపతుల ఉమ్మడి పన్ను మినహాయింపు పరిమితి పెరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకే ITR ఫైల్ చేయొచ్చు. ఇది ముఖ్యంగా మధ్యతరగతి, సింగిల్ ఇన్‌కమ్ కుటుంబాలకు భారీ ఊరటనిస్తుంది.


