News February 10, 2025

నర్సీపట్నం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

నర్సీపట్నం శివారు సుబ్బారాయుడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు నర్సీపట్నం టౌన్ సీఐ గోవిందరావు సోమవారం తెలిపారు. మాకవరపాలెం మండలం చంద్రయ్యపాలెంకు చెందిన వంటాకుల గంగాధర్ (28) ఆదివారం నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో జరిగిన పండుగకు వెళ్లి బైక్‌పై తిరిగి వస్తూ సుబ్బారాయుడుపాలెం వద్ద చెట్టును ఢీకొట్టినట్లు చెప్పారు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందినట్లు వెల్లడించారు.

Similar News

News March 23, 2025

ధోనీ రిటైర్మెంట్‌పై CSK కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

image

MS ధోనీ మరి కొన్నేళ్లు ఆడతారా? ఈ ప్రశ్నకు CSK కెప్టెన్ రుతురాజ్ ఆసక్తికర జవాబిచ్చారు. ‘51ఏళ్ల వయసులోనూ సచిన్ మాస్టర్స్ లీగ్‌లో ఎలా ఆడారో చూశాం. కాబట్టి ధోనీలో ఇంకా చాలా ఏళ్ల ఆట మిగిలి ఉందనుకుంటున్నా. 43 ఏళ్ల వయసులోనూ ఆయన జట్టుకోసం పడే కష్టం మా అందరికీ స్ఫూర్తినిస్తుంటుంది. జట్టులో తన పాత్రకు అనుగుణంగా వీలైనన్ని సిక్సులు కొట్టడమే లక్ష్యంగా సాధన చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.

News March 23, 2025

ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

image

ఖమ్మం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ (విత్ స్కిన్) కేజీ రూ. 185 ఉండగా, స్కిన్ లెస్ కేజీ రూ.210 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ. 130 మధ్య ఉంది. కాగా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.

News March 23, 2025

చీమకుర్తి: లంచం తీసుకుంటూ దొరికిన ప్రిన్సిపల్

image

తన పాఠశాలలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే సిబ్బందికి జీతం అందాలంటే ప్రిన్సిపల్‌కి కొంత డబ్బులు సమర్పించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అటెండర్‌గా పనిచేసే వ్యక్తి నుంచి రూ.17,500 లంచం తీసుకుంటుండగా, ఏసీబీ డీఎస్పీ శిరీష, చీమకురి ఎస్టీ గురుకుల ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్‌ని శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

error: Content is protected !!