News June 23, 2024
నల్గొండకు సీఎం రేవంత్: మంత్రి కోమటిరెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి త్వరలో నల్గొండ జిల్లాకు రానున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శనివారం జరిగిన జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తారని చెప్పారు. జిల్లాలోని ప్రాజెక్టులు, అభివృద్ధిపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షిస్తారని తెలిపారు.
Similar News
News February 23, 2026
నల్గొండ: మైనారిటీల ఆర్థికాభివృద్ధికి గోల్డెన్ ఛాన్స్

మైనారిటీల ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి రెండు కీలక పథకాల కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జిల్లాలో ఆసక్తి గలవారు మార్చి 1 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి.విజయేందర్ రెడ్డి తెలిపారు. వెబ్‌సైట్ :http://tsobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News February 23, 2026
సీఎం కప్ హాకీ రాష్ట్రస్థాయి విజేతగా నల్గొండ జట్టు

హైదరాబాద్ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో నల్గొండ బాలుర జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్‌లో నిజామాబాద్ జట్టుపై 2-0 తేడాతో గెలుపొంది ఛాంపియన్‌గా నిలిచింది. ఈ చరిత్రాత్మక విజయం పట్ల జిల్లా క్రీడల అధికారి అక్బర్ అలీ, హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఇమామ్ కరీం హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులను అభినందించారు.
News February 23, 2026
నల్గొండ: గణనీయంగా తగ్గిన మాతా శిశు మరణాలు

రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు మాతా శిశువుల ఆరోగ్యానికి రక్షణ కవచంలా మారుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలు, మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో గత ఎనిమిదేళ్లుగా జిల్లాలో మరణాల రేటు గణనీయంగా తగ్గుతోంది. 2018-19లో 335 శిశువులు, 14 మంది తల్లులు మరణించగా, 2025 నాటికి ఆ సంఖ్య 72 శిశువులకు, 9 మంది తల్లులకు పడిపోయింది.


