News June 5, 2024
‘నల్గొండలో ఇప్పటికీ BRS గెలవలే’

తెలంగాణ ఏర్పాడ్డాక జరిగిన ఎన్నికల(2014)లో నల్గొండ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన గుత్తా గెలిచారు. 2019లో ఉత్తమ్ కుమార్ రెడ్డి (INC) పోటీ చేసి విజయం సాధించారు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో కుందూరు రఘువీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు బావుట ఎగురవేశారు. దీంతో నల్గొండ ఎంపీ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఖాతా తెరవని స్థానంగా ఉంది.
Similar News
News January 3, 2026
నల్లగొండలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వాల్ పోస్టర్ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు మానవ నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనే కారణమని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, “నో హెల్మెట్ – నో పెట్రోల్” నినాదాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని తెలిపారు.
News January 3, 2026
NLG: మంత్రి కోమటిరెడ్డికి అల్లు అరవింద్ శుభాకాంక్షలు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్కు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ సాగింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు పూర్తి అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.
News January 3, 2026
NLG: నకిలీ బంగారం ముఠా గుట్టురట్టు.. నిందితుల అరెస్ట్

తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ అమాయకులను నమ్మించి మోసగిస్తున్న ఏడుగురి అంతరాష్ట్ర సభ్యుల ముఠాను నల్గొండ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ కె.శివరాం తెలిపారు. వారి నుంచి రూ.1.5 లక్షల నగదు, 5 సెల్ఫోన్లు, అరకేజీ నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.


