News January 22, 2025
నల్గొండలో ఈనెల 28న రైతు మహాధర్నా

నల్గొండ జిల్లా కేంద్రంలో ఈనెల 28న బీఆర్ఎస్ రైతు ధర్నా నిర్వహించనున్నారు. క్లాక్ టవర్ సెంటర్‌లో జరిగే రైతు మహా ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 11 గం.నుంచి మధ్యాహ్నం 2 గం. వరకు కార్యక్రమానికి హైకోర్టు అనుమతి ఇచ్చినట్లు పార్టీ నాయకులు తెలిపారు. రైతు ధర్నాను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News February 19, 2025
ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ BJP: మంత్రి కోమటిరెడ్డి

బీజేపీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దురాజ్‌పల్లిలో మాట్లాడుతూ.. ‘ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ.. వాళ్లకు మా గురించి మాట్లాడే అర్హత లేదు, మాది సెక్యులర్ ప్రభుత్వం, మేము అన్ని మతాలను గౌరవిస్తాం, మాకు అన్ని పండుగలు సమానమే, ప్రజలందరికీ సమాన న్యాయం అందించడమే మా ప్రభుత్వ ధ్యేయం, వచ్చే 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతుంది’ అని మంత్రి అన్నారు.
News February 19, 2025
NLG: ఊపందుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఊపందుకున్నది. ఈనెల 27న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. కాగా యూటీఎఫ్ తరఫున మరోసారి బరిలోకి దిగిన నర్సిరెడ్డికి వామపక్షాలు మద్దతిస్తున్నాయి.
News February 19, 2025
NLG: ఇందిరమ్మ ఇండ్లు సరే.. ఇసుకెట్ల..!?

రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఇప్పటికే లబ్థిదారుల ఎంపిక కూడా పూర్తయింది. సొంత స్థలం ఉన్నవారి ఖాతాల్లో రూ.5 లక్షల చొప్పున జమ చేయనున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక ఉచితంగా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అయితే.. జిల్లాలో సాగుతున్న ఇసుక దోపిడీతో ఇళ్ల నిర్మాణానికి కూడా దొరికే పరిస్థితి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.