News August 4, 2024

నల్గొండలో దోస్తానా అంటే ప్రాణం!

image

దోస్తానా అంటే నల్గొండ వాసులు జాన్ ఇస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు‌ ఇక్కడ కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ‌‌ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్‌‌ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్‌వెల్‌ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day

Similar News

News September 13, 2024

మదర్ డైరీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా

image

ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరుగురు అభ్యర్థులు పోటీ చేస్తే ఆరుగురు భారీ మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన వారిలో కల్లెపల్లి శ్రీశైలం, గుడిపాటి మధుసూదన్ రెడ్డి, పుష్పాల నర్సింహులు, బత్తుల నరేందర్ రెడ్డి, రుద్రాల నరసింహ రెడ్డి, మండలి జంగయ్య ఉన్నారు. గెలుపొందిన వారికి ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య వారికి శుభాకాంక్షలు తెలిపారు.

News September 13, 2024

నల్లగొండ: ఆయిల్‌ పామ్‌ సాగుపై రైతు మొగ్గు

image

మంచి లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ఆయిల్‌ పామ్‌ సాగుకు రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తున్నది. దీనిలోనే భాగంగా నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో ఆయిల్ పామ్‌ సాగు గమనియంగా పెరుగుతుంది. దీనిపై రైతులు కూడా మక్కువ చూపుతున్నారు. గతంలో ఆయిల్ ఫామ్ చెట్లు పెంచిన రైతులు అధిక లాభాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

News September 13, 2024

ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ: జిల్లా కలెక్టర్

image

ఇవాళ ఫొటో ఓటరు జాబితాను ఆయా గ్రామపంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాలలో ప్రచురించనున్నట్లు నల్గొండ కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ముసాయిదా ఫొటో ఓటరు జాబితాపై ఈనెల 18న జిల్లా స్థాయిలో ఎన్నికల అథారిటీ, 19న మండల స్థాయిలో MPDOలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.