News February 7, 2025
నల్గొండలో నామినేషన్ వేయనున్న అభ్యర్థులు

నామినేషన్లకు 7, 10వ తేదీల్లోనే అవకాశం ఉండటంతో ఈ2 రోజుల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు ప్రధాన సంఘాల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. శుక్రవారం TSUTF తరఫు ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలుగుబెల్లి నర్సిరెడ్డి, అలాగే TPUS అభ్యర్థి సరోత్తంరెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి కూడా నామినేషన్లు సమర్పించనున్నారు. కాగా PRTU అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి 10న నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.
Similar News
News December 4, 2025
డిగ్రీ లేకపోయినా ఉద్యోగమిస్తా: జోహో CEO

జోహో సీఈవో శ్రీధర్ వెంబు సూపర్ ఆఫర్ ఇచ్చారు. నైపుణ్యం ఉంటే చాలని.. డిగ్రీ లేకుండానే ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు. పిల్లలపై ఒత్తిడి పెట్టడం మానాలని భారతీయ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అమెరికాలో యువత డిగ్రీ వదిలి నేరుగా ఉద్యోగాలను ఎంచుకుంటున్న ధోరణిని ఉదాహరణగా చూపించారు. Zohoలో ఏ ఉద్యోగానికీ డిగ్రీ క్రైటీరియా లేదని తెలిపారు. తనతో పనిచేస్తున్న టీమ్‌లో సగటు వయస్సు 19 ఏళ్లు మాత్రమేనని అన్నారు.
News December 4, 2025
గ్లోబల్ సమ్మిట్‌కు HYD వ్యాప్తంగా ఫ్రీ బస్సులు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎగ్జిబిషన్‌కు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. ఈ నెల 10 నుంచి 13 వరకు గ్లోబల్ సమ్మిట్‌కు చేరుకునేందుకు MGBS, JBS, కూకట్పల్లి, చార్మినార్, ఎల్బీనగర్ వంటి ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. గ్లోబల్ సమ్మిట్‌కు వెళ్లేందుకు ఉ.9 నుంచి మ.1 వరకు, తిరిగి వచ్చేందుకు సా.4 నుంచి రాత్రి 9 వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి.
News December 4, 2025
NRPT: ‘నషా ముక్త్ భారత్’ అవగాహన వాహనం ప్రారంభం

మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు బ్రహ్మకుమారీల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రచార వాహనాన్ని గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. సమాజ అభివృద్ధికి మాదక ద్రవ్యాల నిర్మూలన అత్యంత కీలకమన్నారు.


