News March 13, 2025

నల్గొండలో నేడు జాబ్ మేళా

image

నేడు నల్గొండ ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నల్గొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లో ఉద్యోగం చేయాలన్నారు. డిగ్రీ, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్లతో నేరుగా జాబ్ మేళాకు హాజరు కావాలని పేర్కొన్నారు.

Similar News

News November 7, 2025

నల్గొండలో ర్యాగింగ్‌పై కలెక్టర్‌ ఆరా

image

నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగిందంటూ మీడియాలో వచ్చిన వార్తలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఆరా తీశారు. ఆమె అదనపు కలెక్టర్, ఆర్డీఓతో కలిసి కళాశాలను సందర్శించారు. విద్యార్థులు, ప్రిన్సిపల్‌తో విడివిడిగా మాట్లాడిన కలెక్టర్, తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే, విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో ఉన్నట్లు చర్చల్లో తెలిసిందని ఆమె పేర్కొన్నారు.

News November 7, 2025

NLG: వేతన బకాయిల కోసం ఎదురుచూపులు

image

చాలీచాలని వేతనాలు.. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల కారణంగా పెట్టిన పెట్టుబడి రాక మధ్నాహ్న భోజన పథకం నిర్వాహకులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. వీటికి తోడుగా గత 6 నెలలుగా జిల్లా వ్యాప్తంగా వేతన బకాయిలు రాకపోవడంతో మధ్నాహ్న భోజన పథకం నిర్వాహకులకు నిర్వహణ మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరాణ దుకాణాల నుంచి సరుకులు అరువు తెచ్చి భోజనం వండుతున్నామని తెలిపారు.

News November 7, 2025

పోలీస్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన

image

వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో శుక్రవారం గీతాలాపన కార్యక్రమం జరిగింది. పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ పూర్తిస్థాయి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. 1875 నవంబర్ 7న బంకిం చంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని రచించారని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.