News February 10, 2025

నల్గొండలో యాదాద్రి జిల్లా యువకుడి సూసైడ్

image

నల్గొండ కలెక్టర్ ఆఫీస్ వెనుక ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద మహిళా ప్రాంగణం రెడ్డి కాలనీకి చెందిన వంశీ అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం కొండగడప. అతను నల్గొండ మహిళా ప్రాంగణం వద్ద ఉన్న లిక్కర్ కంపెనీలో హమాలీగా పని చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 26, 2025

సుదీర్ఘ సూర్య గ్రహణం రాబోతుంది

image

2027 Aug 2న 21వ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సూర్య గ్రహణం ఏర్పడనుంది. గ్రహణం కనిపించే ప్రాంతాలు 6 నిమిషాల 23 సెకన్ల పాటు అంధకారంలో ఉండనున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రారంభమయ్యే ఈ గ్రహణం స్పెయిన్, మొరాకో, అల్జీరియా, ఈజిప్ట్, మిడిల్ ఈస్ట్‌తో పాటు దక్షిణ అమెరికా ప్రాంతాల్లో కనిపించనుంది. ఇంత ఎక్కువ వ్యవధి కలిగిన గ్రహణం అరుదుగా రావడం వల్ల ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని పరిశోధనావకాశంగా చూస్తున్నారు.

News November 26, 2025

పల్నాడు: హెడ్ కానిస్టేబుల్ నిర్వాకం ఇలా..!

image

పెదకూరపాడు నియోజకవర్గంలోని హెడ్ కానిస్టేబుల్ చైన్ లింక్ ద్వారా తోటి పోలీసులు, సామాన్య ప్రజలతో డబ్బులు కట్టించారని బాధితులు ఆరోపిస్తున్నారు. తొలుత డాలర్లు కొనుగోలు చేస్తే తిరిగి వస్తాయి అంటూ కట్టించాడని, తమ వద్ద కమీషన్ పేరుతో డబ్బులు కూడా తీసుకున్నాడని చెబుతున్నారు. చివరకు అతను చెప్పిన విధంగా డబ్బులు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు.

News November 26, 2025

జన్నారం: గంటలో స్పందించిన అధికారులు

image

జన్నారం బస్టాండ్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఉన్నాయని, ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని బుధవారం సాయంత్రం 4 గంటలకు WAY2NEWSలో వార్త పబ్లిష్ అయింది. అధికారులు గంటలో స్పందించి బస్టాండ్‌లోని ఫ్లెక్సీలను తొలగించారు. దాంతో పాటు మండలంలో ఉన్న అన్ని ఫ్లెక్సీలను తీసేయించారు.