News February 10, 2025
నల్గొండలో యాదాద్రి జిల్లా యువకుడి సూసైడ్

నల్గొండ కలెక్టర్ ఆఫీస్ వెనుక ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద మహిళా ప్రాంగణం రెడ్డి కాలనీకి చెందిన వంశీ అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం కొండగడప. అతను నల్గొండ మహిళా ప్రాంగణం వద్ద ఉన్న లిక్కర్ కంపెనీలో హమాలీగా పని చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 10, 2026
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు: మల్లన్న క్షేత్రంలో నేడు హంసవాహన సేవ

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి హంసవాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి అధికారులు స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.
News February 10, 2026
‘తోతాపురి’ టన్ను రూ.1,05,000

AP: వేసవి రాకముందే మామిడి ఎగుమతులు ఊపందుకుంటున్నాయి. రేట్లు కూడా భారీగా పెరిగి రైతులకు లాభాలు తెస్తున్నాయి. NTR(D) విస్సన్నపేట నుంచి ఎగుమతి అయిన తోతాపురి మామిడి రకానికి ముంబై మార్కెట్‌లో రికార్డు స్థాయిలో టన్ను రూ.1,05,000 రేటు పలికింది. ఉత్తరాదిన డిమాండ్ కారణంగానే ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కాగా గతేడాది సీజన్ చివరలో చిత్తూరులో తోతాపురి టన్ను రూ.12-14వేలకు పడిపోయిన విషయం తెలిసిందే.
News February 10, 2026
కొత్తగూడెం: 40 లీటర్ల మద్యం స్వాధీనం

ఎన్నికలు సజావుగా జరిగేలా పోలీస్ శాఖకు ప్రతిఒక్కరు సహకరించాలని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ సోమవారం కోరారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటివరకు కొత్తగూడెం పట్టణ పరిధిలోని 33 డివిజన్లలో రూ.34,000ల విలువగల 40 లీటర్ల మద్యాన్ని, రూ.2,70,000 విలువగల 5.5 కేజీల ప్రభుత్వ నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


