News February 18, 2025
నల్గొండలో రౌడీషీటర్ అరెస్ట్

NLGలోని రాక్ హిల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ రాజేశ్‌ను అరెస్టు చేసినట్లు NLG డీఎస్పీ శివ రాంరెడ్డి సోమవారం తెలిపారు. ఇతనిపై సుమారు 17 హత్యకేసులు ఉన్నట్లు తెలిపారు. పట్టణంతో పాటు ఎల్బీనగర్ ఏరియాను అడ్డాగా చేసుకొని భూసెటిల్మెంట్లు, గంజాయి మత్తులో పలువురికి ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో బాధితుల ఫిర్యాదుతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
Similar News
News March 26, 2025
నల్గొండ: 3 జిల్లాలకు 3 మంత్రి పదవులు..!

ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రి పదవి రేసులో రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్, బీసీ వర్గం నుంచి బీర్ల ఐలయ్య ఉన్నారు. అయితే సూర్యాపేట జిల్లా నుంచి ఉత్తమ్, నల్గొండ నుంచి కోమటిరెడ్డి మంత్రులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఐలయ్యను క్యాబినెట్లోకి తీసుకుంటే భువనగిరి జిల్లాకు కూడా ప్రాతినిధ్యం దక్కినట్లు అవుతుంది. అలాగే దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ పేరు కూడా అమాత్య పదవి రేసులో ఉన్నట్లు చర్చ సాగుతుంది.
News March 26, 2025
NLG: సన్న బియ్యం పంపిణీకి చకచకా ఏర్పాట్లు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డుబియ్యం మొత్తం వెనక్కి పంపించాలని సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే గోదాముల్లో బియ్యం సిద్ధంగా ఉంచిన అధికారులు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వాటిని రేషన్ షాపులకు తరలించి పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
News March 26, 2025
NLG: ధాన్యం కొనుగోళ్లకు కసరత్తు

నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతేడాది యాసంగిలో ఏప్రిల్ మొదటి వారం వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని రైతుల నుంచి విమర్శలు రాగా.. ఈసారి ఆ సమస్య రాకుండా ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో ఈ సీజన్లో 11.26 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. 12.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు.