News February 18, 2025

నల్గొండలో రౌడీషీటర్ అరెస్ట్

image

NLGలోని రాక్ హిల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ రాజేశ్‌ను అరెస్టు చేసినట్లు NLG డీఎస్పీ శివ రాంరెడ్డి సోమవారం తెలిపారు. ఇతనిపై సుమారు 17 హత్యకేసులు ఉన్నట్లు తెలిపారు. పట్టణంతో పాటు ఎల్బీనగర్ ఏరియాను అడ్డాగా చేసుకొని భూసెటిల్మెంట్లు, గంజాయి మత్తులో పలువురికి ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో బాధితుల ఫిర్యాదుతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

Similar News

News November 14, 2025

కరీంనగర్: శతాధిక వృద్ధురాలు మృతి

image

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు బొజ్జ జోగవ్వ (101) అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి 11 గంటల 10 నిమిషాల సమయంలో మృతి చెందారు. ఈమెకు ఒక కొడుకు, నలుగురు మనవళ్లు, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. జోగవ్వ కుటుంబ సభ్యులను పలువురు నాయకులు, గ్రామ ప్రజలు పరామర్శించారు.

News November 14, 2025

సెల్ ఫోన్ వద్దు – పుస్తకం ముద్దు: ప్రకాశం కలెక్టర్

image

విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి, పుస్తకాలకు చేరువ కావాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని శాఖ గ్రంథాలయంలో శుక్రవారం జిల్లా గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, మేయర్ గంగాడ సుజాత, పలువురు అధికారులు పాల్గొన్నారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News November 14, 2025

డబుల్ సెంచరీ దిశగా NDA!

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం దిశగా NDA దూసుకువెళ్తోంది. ప్రస్తుతం 191 సీట్లలో లీడింగ్‌లో ఉండగా డబుల్ సెంచరీ దిశగా సాగుతోంది. మహాగఠ్‌బంధన్ హాఫ్ సెంచరీ మార్క్ కూడా దాటలేదు. ప్రస్తుతం 48 చోట్ల మాత్రమే లీడింగ్‌లో ఉంది. తేజస్వీ యాదవ్ వంటి కీలక నేతలు కూడా వెనుకబడటం గమనార్హం.