News February 5, 2025

నల్గొండ: అరుణాచల గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సులు

image

పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదర్శన కోసం ఫిబ్రవరి 10 తేది సాయంత్రం 7గంటలకు అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్‌ల నడుపుతున్నట్లు ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ కే.జాని రెడ్డి తెలిపారు. ప్రతి పౌర్ణమికి రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని, అరుణాచలం వెళ్ళే భక్తులకు ఆంధ్రప్రదేశ్‌‌లోని కాణిపాకం, తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా ఉంటుందని తెలిపారు. 

Similar News

News December 19, 2025

టాంజానియాలో మునుగోడు వాసి మృతి

image

మునుగోడు మండలం పలివెలకి చెందిన బడుగు రాజు టాంజానియాలో గుండెపోటుతో మరణించాడు. రాజధాని దారుస్సలాంలో జియాలజిస్ట్‌గా పనిచేస్తున్న ఆయన, విధి నిర్వహణలో ఉండగానే అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. రాజు మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు అధికారులతో వారు నిరంతరం జరుపుతున్నారు.

News December 18, 2025

రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

ధాన్యం కొనుగోలు వివరాలను రికార్డుల్లో పక్కాగా నమోదు చేయాలని, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి కేంద్రాల నిర్వాహకులను హెచ్చరించారు. గురువారం ఆమె అనుముల మండలం కొత్తపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా చేశారు. రిజిస్టర్లు, ధాన్యం తేమ శాతం, తూకం వేసిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు లోడ్ చేయాలని ఆదేశించారు.

News December 18, 2025

NLG: ముగిసిన పల్లె సంగ్రామం

image

నల్గొండ జిల్లాలో గ్రామీణ సంగ్రామం ముగిసింది. నెల రోజుల పాటు కొనసాగిన ప్రక్రియ నిన్నటితో పరిసమాప్తం అయింది. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సహకరించిన వారందరికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ధన్యవాదాలు తెలిపారు.