News July 18, 2024
నల్గొండ: ఆశలు ఊరిస్తున్నా .. అనుమానాలు తొలగడం లేదు

నాగార్జునసాగర్ ఆయకట్టుకు ఈసారైనా సాగునీరు అందుతుందా..? అని రైతులు ఎదురుచూస్తున్నారు. కృష్ణా నదికి ఎగువన ఆల్మట్టి డ్యామ్ నుంచి దిగువకు నీటి విడుదల ప్రారంభమైనా.. సాగర్ ఆయా కట్టు రైతుల్లో అనుమానాలు తొలగడం లేదు. గతేడాది ఇలాగే ఆశలు ఊరించినా ఆయకట్టుకు మాత్రం సాగునీరు అందలేదు. ఈసారి కూడా వరదలు వస్తాయా? ఆశలు నెరవేరుతాయా ..? అన్న ఆందోళన అన్నదాతల్లో నెలకొంది.
Similar News
News February 23, 2026
సీఎం కప్ ఫుట్‌బాల్ ఛాంపియన్స్‌గా నల్గొండ!

HYDలో జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి బాలికల ఫుట్‌బాల్ పోటీల్లో నల్గొండ జట్టు సంచలనం సృష్టించింది. సోమవారం జరిగిన ఫైనల్ పోరులో నిజామాబాద్ జట్టుపై 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా DYSO అక్బర్ అలీ మాట్లాడుతూ.. నల్గొండ క్రీడాకారిణులు అద్భుత ప్రతిభ కనబరిచారని కొనియాడారు. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి గిరిబాబు తదితరులు విజేతలను అభినందించారు.
News February 23, 2026
నల్గొండ: మైనారిటీల ఆర్థికాభివృద్ధికి గోల్డెన్ ఛాన్స్

మైనారిటీల ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి రెండు కీలక పథకాల కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జిల్లాలో ఆసక్తి గలవారు మార్చి 1 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి.విజయేందర్ రెడ్డి తెలిపారు. వెబ్సైట్ :http://tsobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News February 23, 2026
సీఎం కప్ హాకీ రాష్ట్రస్థాయి విజేతగా నల్గొండ జట్టు

హైదరాబాద్ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో నల్గొండ బాలుర జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్‌లో నిజామాబాద్ జట్టుపై 2-0 తేడాతో గెలుపొంది ఛాంపియన్‌గా నిలిచింది. ఈ చరిత్రాత్మక విజయం పట్ల జిల్లా క్రీడల అధికారి అక్బర్ అలీ, హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఇమామ్ కరీం హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులను అభినందించారు.


