News March 4, 2025
నల్గొండ: ఇంటర్ పరీక్షలకుసర్వం సిద్ధం: డీఐఈఓ

రేపటి నుంచి ప్రారంభంమయ్యే ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని డీఐఈఓ దశ్రు నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు గంటముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.
Similar News
News March 5, 2025
నల్గొండ: విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలి: జిల్లా ఎస్పీ

రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన.. పరిక్షా కేంద్రాల వద్ద 163 BNSS(144 సెక్షన్) అమల్లో ఉంటుందన్నారు. 57 పరీక్ష కేంద్రాల్లో 28,722 విద్యార్థులు పరీక్షలకు హాజరు కానునట్లు తెలిపారు. ఈ సమయంలో సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలన్నారు.
News March 5, 2025
నల్గొండ: ఇంటర్ వార్షిక పరీక్షలను సవ్యంగా నిర్వహించాలి: కలెక్టర్

రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు సవ్యంగా నిర్వహించేందుకు గాను పరీక్షలు నిర్వహించే కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్‌ను విధించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలోని తహశీల్దార్లను ఆదేశించారు. ఈ మేరకు ఆమే ఉత్తర్వులు జారీ చేస్తూ ఇంటర్మీడియట్ పరీక్షల సక్రమ నిర్వహణకు గాను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్షలు జరిగే సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు.
News March 4, 2025
నల్గొండ: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్: ఎస్పీ.

ఈనెల 5 నుంచి 25 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ అన్ని రకాల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ జిల్లాలో 57 పరీక్షా కేంద్రాలలో 28,722 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.