News June 24, 2024
నల్గొండ: ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలిలా..

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. సెకండియర్లో నల్గొండ జిల్లాలో 3,994 మంది హాజరవగా2,286 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 57.24గా ఉంది. సూర్యాపేట జిల్లాలో 2,364 మంది పరీక్ష రాయగా 1,448 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 61.25గా ఉంది. యాదాద్రి జిల్లాలో 1,835మందికి 1043 (56.84) మంది పాసయ్యారు.
Similar News
News November 24, 2025
నల్గొండ జిల్లాలో బీసీలకు తగ్గిన స్థానాలు

నల్గొండ జిల్లాలో రిజర్వేషన్ల కేటాయింపులో రొటేషన్ విధానం బీసీలను దెబ్బతీసింది. 2019 ఎన్నికలతో పోలిస్తే భారీ ఎత్తున బీసీ రిజర్వేషన్లు తగ్గిపోవడంపై బీసీల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆదివారం ఆర్డీఓల ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా సర్పంచ్ రిజర్వేషన్లు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 869 జీపీలు ఉండగా.. ఇందులో బీసీలకు 140 (2019లో 164) స్థానాలు రిజర్వ్ అయ్యాయి.
News November 24, 2025
ఎన్ఎంఎంఎస్ పరీక్ష.. 1,444 మంది హాజరు

నల్గొండ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలోని 8 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు 1,444 మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. 1,504 మందికి గాను 60 మంది గైర్హాజరయ్యారు. 16 మంది ఎంఈవోలు, 8 మంది సెట్టింగ్స్ స్క్వాడ్, రెవెన్యూ సిబ్బందిని నియమించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.