News October 14, 2024

నల్గొండ: ఇందిరమ్మ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలి: కలెక్టర్ నారాయణరెడ్డి

image

ఇందిరమ్మ కమిటీలను మంగళవారంలోగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ఈ రోజు జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి ఛైర్మన్‌గా, స్వయం సహాయక మహిళ సంఘాల నుంచి ఇద్దరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరుల నుంచి ముగ్గురు కన్వీనర్‌గా గ్రామపంచాయతీ కార్యదర్శితో గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News December 7, 2025

మిర్యాలగూడ డివిజన్ పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

image

నల్గొండ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మిర్యాలగూడ డివిజన్‌లో విధులు నిర్వహించే సిబ్బంది ర్యాండమైజేషన్ను ఆదివారం జిల్లా పరిశీలకురాలు కొర్ర లక్ష్మి పర్యవేక్షణలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఛాంబర్‌లో నిర్వహించారు. డివిజన్‌లోని పది మండలాల్లో 2,418 పోలింగ్ కేంద్రాలకు సరిగ్గా 2,418 బృందాలను కేటాయించారు.

News December 7, 2025

NLG: స్థానిక పోరు.. కూలీలు లేరు..!

image

స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రచారం నల్గొండ జిల్లాలో జోరందుకుంది. అభ్యర్థులు, వారి బంధువులు, సమర్థకులు ప్రచారంలో నిమగ్నం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత తీవ్రమైంది. ఫలితంగా, ప్రస్తుతం యాసంగి సాగు పనులు చేపడుతున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు దొరకక పోవడంతో పొలాల్లో పనులు ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News December 7, 2025

నల్గొండ: మహిళలకు ఫ్రీ ట్రైనింగ్

image

నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో టైలరింగ్, కంప్యూటర్ కోర్సులో ఉచిత శిక్షణకు ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని మహిళా శిశు వికాస కేంద్రం మేనేజర్ ఎ.అనిత తెలిపారు. అర్హత, పూర్తి వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.