News October 3, 2024
నల్గొండ: ఈనెల 14 వరకు డీజేల వినియోగంపై నిషేధం: ఎస్పీ

నల్గొండ జిల్లా పరిధిలో ఈనెల 14 వరకు కలెక్టర్ ఉత్తర్వుల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించే DJలతో సహా అధిక వాల్యూమ్ సౌండ్ ఎమిటింగ్ సిస్టమ్ల వినియోగంపై నిషేధం విధిస్తూన్నట్లు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో డీజేలు నుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా మానవ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై ప్రభావాలు పడుతున్న కారణంగా నిషేధించినట్లు ఎస్పీ వెల్లడించారు.
Similar News
News November 2, 2025
5న భువనగిరిలో ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు

ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీన భువనగిరిలో ఉమ్మడి జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ ఆర్చరీ సెలక్షన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ఆధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి, తునికి విజయ సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. సెలక్షన్ పోటీల్లో పాల్గొనదల్చిన క్రీడాకారులు ఆయా పాఠశాల నుంచి తమ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకు చేరుకోవాలని కోరారు.
News November 2, 2025
NLG: నాడు ఘన చరిత్ర.. నేడు శిథిలావస్థ..!

శాలిగౌరారం(M) ఆకారంలో ఉన్న 800 ఏళ్ల అతి పురాతనమైన సూర్య దేవాలయం నేడు శిథిలావస్థకు చేరింది. కట్టంగూర్ నుంచి 14KM దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం గ్రామపంచాయతీ నుంచి తూర్పు దిశలో 2KM దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పశ్చిమ చాళుక్యులు పరిపాలించారని ఇక్కడ ఉన్న శిలాశాసనం తెలుపుతుంది. వీళ్లు 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం క్రితం ఈ గుడిని నిర్మించారు. ఆలయానికి పునర్వైభవం తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.
News November 2, 2025
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి: కలెక్టర్ ఇలా

వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ రోజు ఆమె తిప్పర్తి(M) చిన్న సూరారం గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.


