News June 11, 2024
నల్గొండ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చిగురిస్తున్న ఆశలు

కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ త్వరలో ఉంటుందని కేబినెట్ మీటింగ్లో విధి విధానాలు రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ తాజాగా వెల్లడించడంతో ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సన్నబియ్యం పంపిణీ చేపడతామని చెప్పడంతో లబ్ధిదారులు ఖుషీ అవుతున్నారు. నూతన కార్డుల కోసం 39,874, కార్డుల్లో మార్పునకు 63,691 దరఖాస్తులొచ్చాయి. ఉమ్మడి జిల్లాలో 10,07,090 కార్డులుండగా, లబ్ధిదారుల సంఖ్య 29,84,569గా ఉంది.
Similar News
News December 3, 2025
చిట్యాల: ఇంటి పన్ను వసూళ్లు రికార్డు

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిట్యాల మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. మొత్తం రూ. 13,97,355 వసూలు అయినట్లు ఎంపీడీవో జయలక్ష్మి తెలిపారు. అత్యధికంగా వెలిమినేడులో రూ. 2,70,575 వసూలు కాగా, బొంగోనిచెరువు, గుండ్రాంపల్లిలలో కూడా భారీగా పన్నులు వసూలయ్యాయి. ఎన్నికల కారణంగానే ఈ స్థాయిలో వసూళ్లు పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
News December 3, 2025
మిర్యాలగూడలో అత్యధికం.. అడవిదేవులపల్లిలో అత్యల్పం..!

మిర్యాలగూడ నియోజకవర్గంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల పర్వం ముగిసింది. మిర్యాలగూడ మండలంలో అత్యధికంగా 360 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించగా, అతి తక్కువగా అడవిదేవులపల్లి మండలంలో కేవలం 101 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు.
News December 3, 2025
నల్గొండ: తపాలా శాఖకు కలిసొచ్చిన పంచాయతీ ఎన్నికలు!

జిల్లాలో పంచాయతీ ఎన్నికలు తపాలా శాఖకు కలిసొచ్చాయి. నల్గొండ, చండూరు డివిజన్లలో ఈనెల 11న, 14న మిర్యాలగూడ, 17న దేవరకొండ డివిజన్లో ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటికే రెండు విడతల్లో నామినేషన్లు స్వీకరించారు. మూడో విడత నామినేషన్లు నేటి నుంచి స్వీకరిస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు కొత్త ఖాతాలు సమర్పించాల్సి ఉండడంతో పోస్ట్ ఆఫీసుల్లో ఖాతాలు తెరిచేందుకు బారులు తీరుతున్నారు.


