News April 3, 2024
నల్గొండ: ఉరి వేసుకుని యువకుడి మృతి

కట్టంగూరు మండలం కురుమూర్తి గ్రామానికి చెందిన గుండెగోని హరిబాబు(27) తాగుడుకు బానిస అయ్యాడు. తల్లి లక్ష్మమ్మ హరిబాబును మందలించడంతో మనస్థాపం చెంది మంగళవారం ఇంటి నుంచి వెళ్లాడు. చెరువు అన్నారం గ్రామ శివారులో ఒక స్మారక స్థూపానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తమ్ముడు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ అప్జల్ అలీ బుధవారం తెలిపారు.
Similar News
News December 3, 2025
ఆ వివరాలు ఇవ్వకుంటే.. ఇదే జరుగుద్ది: నల్గొండ కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా లెక్కలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి పోలింగ్ వరకు ఎంత డబ్బు ఖర్చు చేశారో వాటికి సంబంధించిన ఆధారాలతో కూడిన వివరాలను ఎన్నికల అధికారులకు అందించాలన్నారు. లేదంటే గెలిచిన వారు పదవులు కోల్పోతారన్నారు. మూడేళ్లపాటు పోటీకి అనర్హులు అవుతారని, ఓడిన వారు కూడా ఇవ్వాల్సిందేనని తెలిపారు.
News December 3, 2025
నల్గొండ: అప్పీల్స్ను పరిశీలించిన కలెక్టర్

నల్గొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లతోపాటు తిరస్కరణలపై వచ్చిన అప్పీల్స్ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. 9 మండలాల నుంచి ఆర్డీవోలు అశోక్ రెడ్డి, శ్రీదేవి సమర్పించిన జాబితాపై కలెక్టర్ సమగ్ర పరిశీలన చేశారు. నల్గొండ డివిజన్లో వచ్చిన 19 అప్పీల్స్లో 15 తిరస్కరణ,4 అంగీకరించగా చండూరు డివిజన్లో 3 అప్పీలు రాగా వీటిలో 2 తిరస్కరణ, 1 అంగీకరించారు.
News December 3, 2025
నల్గొండ: మూడో దశ.. నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ

దేవరకొండ నియోజకవర్గంలో ఈరోజు నుంచి మూడో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఉ.10 గంటల నుంచి ప్రారంభం కానుంది. మొత్తం దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది మండలాల్లో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని చందంపేట, నేరేడు,గుమ్ము మండలాలలోని సమస్యాత్మక కేంద్రాల్లో గట్టి పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు.


