News April 29, 2024
నల్గొండ ఎంపీ ఎన్నికల బరిలో 22 మంది అభ్యర్థులు

నల్గొండ పార్లమెంట్ స్థానానికి 31 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 9 మంది అభ్యర్థులు నామినేషన్లు సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్యే ఇక్కడ పోటీ నెలకొని ఉంది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
Similar News
News April 19, 2026
నల్గొండలో 21న మినీ జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 21న నల్గొండలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో (ఐటిఐ క్యాంపస్) ‘మినీ జాబ్ మేళా’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎస్. పద్మ తెలిపారు. ఈ మేళాకు SSC, ఇంటర్, ఏదైనా డిగ్రీ చదివిన 18-30 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులు. ఎంపికైన వారికి హైదరాబాద్, నల్గొండ పరిసర ప్రాంతాల్లో రూ. 10,000 నుంచి రూ. 20,000 వరకు వేతనం ఉంటుందని తెలిపారు.

News April 18, 2026
NLG: 60,389 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 60,389 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో 60,221 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 168 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం సేకరించారు. ఈ ప్రక్రియ ద్వారా 7,077 మంది రైతులకు లబ్ధి చేకూరింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 444 కొనుగోలు కేంద్రాలకు గాను, ప్రస్తుతం 373 కేంద్రాలు పనిచేస్తున్నాయి.