News February 15, 2025
నల్గొండ: ఎక్కడ చూసినా అదే చర్చ..!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నల్గొండ – ఖమ్మం – వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News March 14, 2025
మఠంపల్లి: ఘనంగా హోలీ సంబరాలు

మఠంపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో హోలీ సంబరాలు శుక్రవారం అంబారాన్నంటాయి. ఈ మేరకు ఉదయం నుంచే యువతీ యువకులు, మహిళలు, చిన్నారులు రంగులు పూసుకుంటూ ఒకరిపై ఒకరు రంగు నీళ్లు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం హోలీ.. హోలీ.. హోలీ అంటూ నినాదాలు చేస్తూ సంతోషంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు.
News March 14, 2025
మిర్యాలగూడ: రోడ్డు ప్రమాదం.. వృద్ధుడి మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌లో జరిగింది. ఎస్ఐ వివరాలు.. నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెంకి చెందిన సైదులు(60) శ్రీనివాసనగర్‌లో జరుగుతున్న బంధువుల పెళ్లికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో కోదాడ- జడ్చర్ల రాహదారిని దాడుతున్నాడు. ఈ క్రమంలో అతణ్ని బైక్ ఢీకొంది. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి నుంచి నల్గొండ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
News March 14, 2025
నల్గొండ: ఈనెల 17, 18 తేదీల్లో కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల వంటా వార్పు

రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 17, 18 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట వంట వార్పు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సిఐటీయూ జిల్లా నాయకులు అవుటు రవీందర్ తెలిపారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమస్యలతో కూడుకున్న మెమోరాండం నల్గొండ జిల్లా కార్యాలయంలో సమర్పించారు.