News February 13, 2025
నల్గొండ: ఎన్నికల బరిలో 22 మంది!

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల బరిలో 22 అభ్యర్థులు నిలిచారు. ఈ నెల 10వ తేదీతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం ముగిసింది. ఈనెల 11న నామినేషన్ల పరిశీలనలో 23అభ్యర్థులకు గాను ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో 13న నామినేషన్ల ఉపసంహరణ పర్వం సైతం ముగిసింది.
Similar News
News December 19, 2025
నల్గొండ : గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

నల్గొండ మండలంలోని చర్లపల్లి గురుకుల కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్న శివాని అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. మెడ, తల భాగాల్లో తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆమెను తోటి విద్యార్థినులు గమనించి వెంటనే పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 19, 2025
క్లెయిమ్ చేయని ఆస్తులపై 20న అవగాహన శిబిరం

క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం డిసెంబర్ 20న నల్గొండ కలెక్టరేట్ కార్యాలయ ఉదయాదిత్య భవనంలో ఉమ్మడి శిబిరం నిర్వహిస్తున్నారు. క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు.. బ్యాంకు శాఖ, భీమా సంస్థ, మ్యూచువల్ ఫండ్ సంస్థ, శిబిరంలోని స్టాక్ బ్రోకరేజీ సంస్థ, ఆన్లైన్ ద్వారా స్టాక్ బ్రోకర్లలో దేనినైనా సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.
News December 19, 2025
నల్గొండ: జనవరి నుంచి HPV టీకాలు

మహిళల్లో వచ్చే క్యాన్సర్లను అరికట్టాలనే లక్ష్యంతో 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలందరికీ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ (HPV)ను వేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. HPV టీకాలపై డీఎంహెచ్ కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్లు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ టీకాలను 2026 జనవరి నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇస్తామన్నారు.


