News March 18, 2025
నల్గొండ: ఎల్ఆర్ఎస్ 25% రిబేట్‌కు స్పందన

రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం ఈనెల 31లోగా ఎల్ఆర్ఎస్ చెల్లించిన వారికి ప్రకటించిన 25% రిబెట్ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ మేరకు సోమవారం నల్గొండ మున్సిపల్ పరిధిలో 4 లబ్ధిదారులు ఎల్ఆర్ఎస్ చెల్లించి 25% రిబేటు పొందారు. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అందజేశారు.
Similar News
News February 24, 2026
NLG: రైస్ మిల్లర్లపై పోలీసు కేసుల కలకలం!

జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎగ్గొట్టిన రైస్ మిల్లర్లపై సివిల్ సప్లై అధికారులు కన్నెర్ర చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా అక్రమాలకు పాల్పడిన పలువురు మిల్లర్లపై రెండు రోజుల నుంచి వరుసగా కేసులు నమోదు చేయించడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బియ్యం మాయం చేసినట్లు గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వెనువెంటనే ఎఫ్.ఐ.ఆర్‌లు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
News February 24, 2026
నల్గొండ: పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: కలెక్టర్

జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు జరిగే పరీక్షల దృష్ట్యా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్-163 సెక్షన్ అమలు చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. జిల్లాలోని 45 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఎవరూ గుంపులుగా ఉండొద్దన్నారు.