News June 18, 2024
నల్గొండ ఎస్పీగా మాజీ ఎమ్మెల్యే అల్లుడు

యాంటి నార్కోటిక్ బ్యూరో ఇన్ఛార్జిగా పని చేస్తున్న శరత్చంద్ర పవార్ను నల్గొండ జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. ఈయన ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ అల్లుడు. 2016 ఐపీఎస్ బ్యాచ్లో ఎంపికై మొదటిసారి ములుగు జిల్లా ఏటూరునాగారం ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా, HYD సెంట్రల్ జోన్ ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం ఉంది. అటు సూర్యాపేట ఎస్పీగా సన్ప్రీత్ సింగ్ను నియమించింది.
Similar News
News November 11, 2025
NLG: పంట పండింది.. సేకరణ ఇలా

NLG జిల్లాలో ధాన్యం సేకరణ సాఫీగా కొనసాగుతోంది. జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో రైతులు 5,26,796 ఎకరాల్లో వరి సాగు చేయగా.. 2,56,665 ఎకరాల్లో సాధారణ, 2,70,131ఎకరాల్లో సన్నరకం సాగు చేశారు. తద్వారా 13,44,268 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం 4,73,036 టన్నులు పోగా.. అమ్మకానికి 6,30,981 మెట్రిక్ టన్నుల కొనుగోలు కేంద్రాలకు వస్తుందని వ్యవసాయ శాఖ లెక్కలు వేస్తోంది.
News November 11, 2025
NLG: ధాన్యం సేకరణ నిబంధనల ఉల్లంఘన: ఇద్దరు అధికారులు సస్పెండ్!

ధాన్యం సేకరణ నియమాలను ఉల్లంఘించినందుకుగాను నల్గొండ జిల్లా, మిర్యాలగూడ, ఆలగడప క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి కుమారి అఫీసర్ను, అలాగే అవంతిపురం ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జి కె.సైదులును విధుల్లోంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సహకార అధికారి పత్యా నాయక్ విచారణ జరిపి నివేదిక సమర్పించారు.
News November 11, 2025
NLG: ప్రమాదాల నివారణకు సమన్వయం అవసరం: కలెక్టర్

రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశంలో ఆమె మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, వాటి నివారణకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బ్లాక్స్పాట్లలో శాశ్వత చర్యలు చేపట్టాలి. స్కూల్ బస్సులకు సైడ్ మిర్రర్లు, సహాయకులు తప్పనిసరిగా ఉండాలన్నారు.


