News June 28, 2024

నల్గొండ ఎస్పీని కలిసిన ట్రాన్స్ జెండర్స్

image

నల్గొండ జిల్లా ఎస్పీ శరద్ చంద్ర పవార్‌ను ట్రాన్స్ జెండర్స్ కలిశారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు నందిని మాట్లాడారు. ‘నల్గొండలోని శ్రీనగర్ కాలనీ రోడ్ నంబర్ 8లో గుంటన్నర స్థలం కొన్నాం. ఆ స్థలంలో ఇల్లు కట్టుకుందామంటే స్థానికులు అడ్డుకుంటున్నారు’ అని చెప్పారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరామన్నారు.

Similar News

News December 12, 2024

NLG: ప్రత్యేక యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక

image

ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఇళ్లను పేదలకు పంపిణీ చేసేందుకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక యాప్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ యాప్‌లో అధికారులు అర్హులైన లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తున్నారు. కాగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఉమ్మడి నల్గొండ జిల్లాలో 42 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

News December 12, 2024

NLG: పెన్షన్ లబ్ధిదారుల్లో నిరాశ

image

పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారులు నిరాశకు గురవుతున్నారు. నల్గొండ జిల్లాలో సుమారు లక్ష మందికి పైగానే పెన్షన్లు అందుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు పెన్షన్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పింఛన్ల పెంపుపై మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో పెంపు ఇప్పట్లో ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News December 11, 2024

NLG: పల్లె పోరుకు ముమ్మర ఏర్పాట్లు

image

ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల తేదీ ఎప్పుడు ప్రకటించినా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఓటరు జాబితా పూర్తి చేయడంతోపాటు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సులు, సామగ్రి సిద్ధం చేసి పెట్టుకున్నారు. నల్లగొండలో 856, యాదాద్రి భువనగిరిలో 428, సూర్యాపేటలో 486 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తుంది.