News March 18, 2025
నల్గొండ ఎస్పీ కీలక నిర్ణయం

నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేరాలను తగ్గించేందుకు కొత్త ప్రణాళికను రూపొందించారు. అందులో భాగంగా గ్రామానికి ఓ పోలీసు అధికారిని నియమించారు. కాగా వారు మంగళవారం విధుల్లో చేరనున్నారు. గ్రామ పోలీస్ అధికారులు తప్పనిసరిగా వారికి కేటాయించిన గ్రామాలకు వెళ్లాలని, ప్రజలతో మమేకమవ్వాలని ఎస్పీ తెలిపారు. తద్వారా నేరాలను అదుపులో ఉంచొచ్చని చెప్పారు.
Similar News
News March 18, 2025
నల్గొండ: పనుల ప్రారంభం వేగవంతం చేయాలి: కలెక్టర్

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో నల్గొండ బైపాస్ జాతీయ రహదారి 565కు సంబంధించి అవార్డు పాస్ చేయడం, పనుల ప్రారంభం వంటివి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె తన ఛాంబర్లో నేషనల్ హైవే 565 నల్గొండ బైపాస్పై జాతీయ రహదారుల సంస్థ అధికారులు ,ఆర్ అండ్ బీ అధికారులతో సమావేశం అయ్యారు.
News March 18, 2025
నల్గొండ: మద్దతు ధర పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్

2024 -25 రబీ ధాన్యం మార్కెట్కు రానున్న నేపథ్యంలో రబీ ధాన్యం సేకరణకు పౌరసరఫరాలు, వ్యవసాయ అనుబంధ శాఖలు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణ, మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జిలకు ఉద్దేశించి శనివారం ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు మద్దతు ధర పోస్టర్ ఆవిష్కరణ చేశారు.
News March 18, 2025
నల్గొండ: సీతారాముల కళ్యాణ తలంబ్రాలు ఇంటికే: RM

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలను TGS RTC కార్గో ద్వారా రూ.151 చెల్లిస్తే భక్తుల ఇళ్ల వద్దకు చేరుస్తామని ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ కే. జాని రెడ్డి తెలిపారు. ప్రజలు తమ దగ్గరలో ఉన్న ఆర్టీసి లాజిస్టిక్స్లో రూ.151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.