News September 30, 2024
నల్గొండ: ఏసీబీకి చిక్కిన పశు వైద్యాధికారి
చింతపల్లి మండల పశు వైద్యాధికారి జోసఫ్ పాల్ రూ.6,000 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గేదెల బ్యాంకు లోన్, హెల్త్ సర్టిఫికెట్ కోసం నసర్లపల్లికి చెందిన ఓ రైతు వద్ద రూ.8వేలు డిమాండ్ చేసి రూ.6 వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్ కి ఫోన్ చేయాలని ఉమ్మడి ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు.
Similar News
News October 10, 2024
NLG: సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి..
సద్దుల బతుకమ్మ పండుగను నేడు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన సెంటర్లు, కాలనీలు, ఆలయాల్లో మహిళలు ఘనంగా జరుపుకోనున్నారు. ఇందు కోసం మున్సిపల్ శాఖ ఏర్పాట్లు చేసింది. బతుకమ్మ ఆడే కూడళ్ల వద్ద విద్యుత్ లైట్లను అమర్చారు. నల్గొండలో వల్లభరావు చెరువు, సూర్యాపేటలో సద్దుల చెర్వు వద్ద ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం ఎన్జీ కళాశాల మైదానంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
News October 10, 2024
NLG: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: మంత్రి
క్రీడా రంగంలో తెలంగాణను దేశంలోనే ముందు ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఖేలో ఇండియా ఉమెన్ కోకో రాష్ట్ర ట్రాయాల్స్ సెలక్షన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణించాలన్నారు.
News October 9, 2024
MLG: ఒకే ఏడాదిలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమైన ఈరోజుల్లో మిర్యాలగూడ మండలం జాలుబావి తండాకు చెందిన భూక్యా సేవా రాథోడ్ ఒకే ఏడాదిలో ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తా చాటాడు. ఇటీవల వెల్లడించిన DSC ఫలితాలలో SA, తెలుగు 8 ర్యాంక్‌తో పాటు SGT ఉద్యోగం సాధించారు. గతంలో గురుకుల జేఎల్ (13 ర్యాంక్), పిజిటి (8 ర్యాంక్), TGT, TSPSC జూనియర్ లెక్చరర్ 13 ర్యాంక్ ఉద్యోగాలు సాధించారు. నేడు సీఎంతో నియామక పత్రం అందుకున్నారు.