News September 8, 2024

నల్గొండ: ఐదు రోజుల బాలుడి మృతి

image

ఐదు రోజుల బాలుడు మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని ఓ పిల్లల ఆసుపత్రిలో జరిగింది. కాగా, వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందినట్లు బంధువులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పెళ్లైన 8 ఏళ్ల తర్వాత పుట్టిన బాబు మృతితో బాధితులు తీవ్ర రోదనకు గురయ్యారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 23, 2025

NLG: భర్తీకి నోచని పోస్టులు.. ఆ దరఖాస్తులు ఏమయ్యాయి?

image

నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పోస్టులు మంజూరైనా భర్తీకి నోచుకోవడం లేదు. ఈ కళాశాలలో రెగ్యులర్ పద్ధతిన వివిధ విభాగాల్లో 952 పోస్టులను భర్తీ చేయగా.. ఏడాది కిందట మరో 237 పోస్టులను అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించారు. ఏడాది దాటిన ఆ పోస్టుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News October 23, 2025

NLG: పర్వతరావు చెరువుకు రూ.1.22 కోట్లు మంజూరు

image

దేవరకొండ మండలంలోని పర్వతరావు చెరువు పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం రూ.1.22 కోట్లతో పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చెరువు పునరుద్ధరణకు నిధులు మంజూరు కావడం పట్ల ఆయకట్టు పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

News October 23, 2025

నాగార్జునసాగర్: సాధించిన దానికంటే ఎక్కువ విద్యుత్‌ ఉత్పత్తి

image

నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న విద్యుత్ కేంద్రం ఈ ఏడాది లక్ష్యాన్ని మించి విద్యుత్తును ఉత్పత్తి చేసిందని జెన్‌కో సీఈ మంగేష్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది 70 మిలియన్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోగా, మంగళవారం రాత్రికి ఆ లక్ష్యాన్ని మించి ఉత్పత్తిని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఐడల్ డైరెక్టర్ అజయ్ కుమార్ విద్యుత్ అధికారులను అభినందించారు.