News March 10, 2025

నల్గొండ: కప్పు కొట్టిన భారత్‌కు మాజీ ఎమ్మెల్యే అభినందనలు

image

ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియాకు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. NZతో మరోసారి ఫైనల్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది భారత్. 252 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో రాణించారు. శ్రేయస్ అయ్యర్ 48, అక్షర్ పటేల్ 29 రన్స్ చేశారు. ఆఖర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, జడేజా టీమ్ ఇండియాను గెలిపించారు. 

Similar News

News October 27, 2025

నల్గొండలో 85% ధాన్యం కేంద్రాలు ప్రారంభం: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలో ఈ వానాకాలం ధాన్యం సేకరణ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 85 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. దేవరకొండ, చండూరు డివిజన్లలో వరికోతలు ఆలస్యం కావడంతో, మిగిలిన కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. HYD నుంచి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత కలెక్టర్ ఈ వివరాలు తెలిపారు.

News October 27, 2025

బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలి: నల్గొండ SP

image

ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌ డే సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 55 మంది అర్జీదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News October 27, 2025

NLG: మైనర్‌పై అత్యాచారయత్నం.. నిందితుడికి పదేళ్ల జైలు

image

మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ నల్గొండ ఎస్సీ/ఎస్టీ, పోక్సో కేసుల కోర్టు తీర్పు వెలువరించిందని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. తిప్పర్తి మండలం కేసరాజుపల్లి గ్రామానికి చెందిన గొర్ల సైదులుకు ఈ శిక్ష పడింది. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.