News March 25, 2024
నల్గొండ: కలర్ పడుద్ది.. కండ్లు భద్రం..!
హోలీ అంటేనే రంగుల కేళి..చిన్నా పెద్దా తేడా లేకుండా కలిసి ఆడే పండుగ. నేడు రంగుల వేడుకను జరుపుకొనేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు సిద్ధమైన వేళ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సరదా సంబురం మాటున ప్రమాదం పొంచి ఉన్నదని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రంగులు కళ్లల్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తే మంచిది అని అంటున్నారు.
Similar News
News September 14, 2024
NLG: పట్టుదలతో కృషి చేస్తేనే లక్ష్యం సాధించవచ్చు: జిల్లా కలెక్టర్
పట్టుదలతో కృషి చేస్తేనే లక్ష్యాన్ని సాధించవచ్చని నల్గొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుక్రవారం అన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల గ్రౌండ్, ఆట స్థలాన్ని, హాస్టల్ ను, తరగతి గదులను, కిచెన్, టాయిలెట్స్, స్టోర్ రూంలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆటలాడుతున్న విద్యార్థులతో ముఖాముఖి ముచ్చటించారు.
News September 13, 2024
మదర్ డైరీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా
ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరుగురు అభ్యర్థులు పోటీ చేస్తే ఆరుగురు భారీ మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన వారిలో కల్లెపల్లి శ్రీశైలం, గుడిపాటి మధుసూదన్ రెడ్డి, పుష్పాల నర్సింహులు, బత్తుల నరేందర్ రెడ్డి, రుద్రాల నరసింహ రెడ్డి, మండలి జంగయ్య ఉన్నారు. గెలుపొందిన వారికి ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య వారికి శుభాకాంక్షలు తెలిపారు.
News September 13, 2024
నల్లగొండ: ఆయిల్ పామ్ సాగుపై రైతు మొగ్గు
మంచి లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ఆయిల్ పామ్ సాగుకు రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తున్నది. దీనిలోనే భాగంగా నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో ఆయిల్ పామ్ సాగు గమనియంగా పెరుగుతుంది. దీనిపై రైతులు కూడా మక్కువ చూపుతున్నారు. గతంలో ఆయిల్ ఫామ్ చెట్లు పెంచిన రైతులు అధిక లాభాలు ఉన్నట్లు పేర్కొన్నారు.