News March 23, 2024
నల్గొండ: కాంగ్రెస్ ఖాతాలోకి రెండు మున్సిపాలిటీలు

కాంగ్రెస్ ఖాతాలో రెండు మున్సిపాలిటీలు చేరాయి. నల్గొండ జిల్లాలోని హాలియా, నందిగొండ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. ఆయా చోట్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్లపై అవిశ్వాసం నెగ్గడంతో శుక్రవారం నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించారు. రెండు చోట్లా కాంగ్రెస్ మద్దతుదారులే పదవులు దక్కించుకున్నారు. హాలియా నూతన ఛైర్ పర్సన్‌గా యడవెల్లి అనుపమా, నందిగొండ ఛైర్ పర్సన్‌గా అన్నపూర్ణ ఎన్నికయ్యారు.
Similar News
News April 18, 2026
నల్గొండ: సర్పంచ్ కుమారుడి ‘పెత్తనం’పై కంప్లైంట్

సర్పంచ్ కుమారుడి వేధింపులు తాళలేకపోతున్నానంటూ చందంపేట మండలం గుంటిపల్లి పంచాయతీ కార్మికుడు నల్ల దేవరాజు శుక్రవారం కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ కొడుకు అనధికారికంగా పెత్తనం చలాయిస్తూ, తాను విధులకు హాజరవుతున్నా గైర్హాజరు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల గత ఆరు నెలలుగా జీతం రాకుండా అడ్డుపడుతున్నారని, వెంటనే విచారణ జరిపి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కార్మికుడు వేడుకున్నారు.
News April 18, 2026
NLG: పాలిసెట్ విద్యార్థులకు గుడ్ న్యూస్

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్) రాసే విద్యార్థులకు నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ కేవీ.నరసింహారావు తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి మే 11 వరకు తరగతులు జరుగుతాయన్నారు. మే 13న జరగనున్న పాలిసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని చెప్పారు. విద్యార్థులు ఈనెల 18, 19వ తేదీల్లో కళాశాలలో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
News April 18, 2026
అడవిదేవులపల్లిలో అత్యధికంగా ఉష్ణోగ్రత

జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటగా, అడవిదేవులపల్లిలో అత్యధికంగా 43 డిగ్రీలు నమోదైంది. ఈనెల 13 నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. మే నెల చివరి వరకు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.


