News March 20, 2024

నల్గొండ: కారు బీభత్సం

image

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో కారు బీభత్సం సృష్టించింది. భట్లపల్లి గ్రామంలో అదుపుతప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలైయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 24, 2025

రౌడీ షీటర్లకు ఎస్పీ కౌన్సెలింగ్‌

image

ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవ‌ని నల్గొండ జిల్లా ఎస్పీ శ‌ర‌త్ చంద్ర ప‌వార్ హెచ్చరించారు. శుక్ర‌వారం జిల్లాలోని రౌడీ షీటర్స్‌‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌తో సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలగేవారికి పోలీసుల సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

News October 24, 2025

2 రోజులు వర్షాలు.. జాగ్రత్తలు తీసుకోండి: కలెక్టర్

image

రానున్న 2 రోజులు వర్ష సూచన ఉన్నందున, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ధాన్యం త్వరగా మిల్లులకు తరలించాలని, కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత లేని ధాన్యాన్ని నింపి పంపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ఈ 2 రోజులు కోతలు వాయిదా వేసుకోవాలన్నారు.

News October 24, 2025

NLG: ఆ గ్రామానికి రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం

image

చిట్యాల(M) ఉరుమడ్లకు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గ్రామానికి చెందిన గుత్తా మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా వ్యవహరించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీగా, ప్రస్తుతం మండలి ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు, కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా ఉండగా, అమిత్ రెడ్డి రాష్ట్ర డైరీ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఒకే గ్రామం నుంచి ఇంత మంది రాజకీయంగా గుర్తింపు పొందడం విశేషం.