News February 12, 2025
నల్గొండ: కుమారుడి బాధ్యతను నెరవేర్చిన కుమార్తె

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో చేపూరి బాబురావు (45) ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి సంతానంగా కుమార్తెలు కావడంతో పెద్ద కుమార్తే తండ్రికి తలకొరివి పెట్టి, కుమారుడు లేని లోటు తీర్చింది. అలాగే మృతదేహానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి పుష్ప పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Similar News
News December 10, 2025
NLG జిల్లాలో మొదటి విడత ఎన్నికల వివరాలు

NLG జిల్లాలో చండూరు, నల్లగొండ డివిజన్లలో మొత్తం 14 మండలాల్లో మొదటి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
✈ సర్పంచ్ స్థానాలు: 294
✈ అభ్యర్థులు: 966 మంది
✈ వార్డు స్థానాలు: 2870
✈ అభ్యర్థులు: 5934 మంది
✈ పోలింగ్ కేంద్రాలు: 2870
✈ ఓట్ల లెక్కింపు: 2 గం. నుంచి
✈ పీవోలు (పోలింగ్ అధికారులు): 3444 మంది
✈ ఉప పీవోలు: 4448 మంది
News December 10, 2025
NLG: బాండు పేపర్లు.. విచిత్ర హామీలు

పంచాయతీ ఎన్నికల్లో గెలవాలనుకున్న సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులు అలవికాని హామీలు ఇస్తున్నారు. తాజాగా తుంగతుర్తిలో గుడితండకు చెందిన జైపాల్ నాయక్, రుస్తాపురానికి చెందిన శ్రీహరికుమార్ బాండు పేపర్ రాసిచ్చిన విషయం తెలిసిందే. ఇలాగే పలువురు గ్రామానికి ఫలానా పని చేసి ఇస్తాం.. మీ కులం వారికి భవనం కట్టిస్తాం.. మీ కులం వారికి వంట సామగ్రి పంపిణీ చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు.
News December 10, 2025
NLG: 829 జీపీల్లో రేపే పోలింగ్

జిల్లాలో మూడు విడతల్లో 869 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 14 మండలాల్లో 318 గ్రామ పంచాయతీల్లో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించి మంగళవారం ప్రచార ప్రక్రియ ముగిసింది. ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.


