News July 26, 2024

నల్గొండ: కూలీలతో కలిసి నాటు వేసిన ఎమ్మెల్యే 

image

విమర్శలు, ప్రతీ విమర్శలు, నియోజకవర్గ అభివృద్ధి పనులంటూ బిజీగా ఉండే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూలీలతో మమేకయ్యారు. వారితో కలిసి నాటు వేశారు. రుణమాఫీ అయిందా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే తమతో కలిసి నాట్లు వేయడం సంతోషంగా ఉందని కూలీలు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని బీఎల్ఆర్ తెలిపారు.

Similar News

News January 5, 2026

NLG: అమ్మ బాబోయ్.. కేజీ రూ.300లా!

image

నల్గొండ జిల్లాలో చికెన్ రేటు ట్రిపుల్ సెంచరీ కొట్టింది. కిలో మాంసం రూ.300కి చేరడంతో మాంసం ప్రియులు బెంబేలెత్తుతున్నారు. గుడ్డు ధర రూ.8.50 ఉండగా.. లైవ్ కోడి రూ.185, స్కిన్‌లెస్ రూ.290-310 పలుకుతోంది. బర్డ్ ఫ్లూతో ఉత్పత్తి తగ్గిందని, అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. పండగ పూట ముక్క లేకపోతే ఎలా అని మాంసం ప్రియులు వాపోతుండగా, రేట్లు ఇప్పట్లో దిగిరావని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

NLG: టెట్ అభ్యర్థులకు తప్పని తిప్పలు

image

టెట్ అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల కేటాయింపు ఇబ్బందిగా మారింది. మొదటి రోజే అప్లై చేసినా, ప్రాధాన్యత క్రమంలోని చివరి పట్టణాల్లో కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. జిల్లా నుంచి 1,557 మంది ఉపాధ్యాయులతో సహా సుమారు 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన పరీక్షలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి.