News July 19, 2024
నల్గొండ: కూల్ డ్రింక్ ఇచ్చి.. మహిళ మెడలో బంగారం చోరీ
మహిళ మెడలో పుస్తెలతాడు లాక్కెళ్లిన ఘటన పీఏ పల్లి మండల పరిధిలోని మల్లాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన గన్నేబోయిన ముత్యాలమ్మ గ్రామ శివారులో పంట పొలంలో పనిచేస్తుంది. అక్కడికి బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి తెలిసిన వ్యక్తిలా పరిచయం చేసుకుని కూల్ డ్రింక్ తాగమని ఇచ్చాడు. డ్రింక్ తాగుతుండగా రాయితో ఆమె తలపై కొట్టి బంగారం లాక్కెళ్లినట్లు SI నర్సింహులు తెలిపారు.
Similar News
News October 7, 2024
నాంపల్లి: ‘వేయి ఒక్క రూపాయికే మూడు తులాల బంగారం’
నాంపల్లి మండల పరిధిలోని దేవత్ పల్లీ గ్రామంలో మల్లయ్య దేవస్థాన కమిటీ దుర్గామాత శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా భక్తులను ఆకర్షించే విధంగా వినూత్న కార్యక్రమాన్నికి శ్రీకారం చుట్టారు. దాదాపు మూడు తులాల అమ్మవారి ముక్కు పోగును 1001/- రూలకే లక్కీ డ్రాలో పొందే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్వాములు ఈరోజు ఉదయం పాల్గొన్నారు. చివరి రోజున విజేతను అందరి సమక్షంలో ప్రకటిస్తామని వారు చెప్పారు.
News October 7, 2024
నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం
నాగార్జునసాగర్ జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో 51,445 క్యూసెక్కుల ఉండగా, అవుట్ ఫ్లో 51,444 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు గాను ప్రస్తుతం 588.60 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు గాను ప్రస్తుతం 308.1702 టీఎంసీలుగా ఉందన్నారు.
News October 7, 2024
NLG: ఉపాధి ప్రణాళికకు అధికారుల కసరత్తు
జిల్లాలో ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించడమే లక్ష్యంగా అధికారులు ఉపాధి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 84 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి పనుల గుర్తింపునకు శ్రీకారం చుట్టిన అధికారులు ఈ నెలాఖరులోగా పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించారు. నవంబర్ మాసం చివరినాటికి పనుల లక్ష్యాన్ని నిర్ధారించనున్నారు. జిల్లాలో 3,58,571 జాబు కార్డులు ఉన్నాయి.