News May 11, 2024

నల్గొండ: గుండెపోటుతో యువకుడు మృతి

image

గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది.  గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా బ్రాహణవెల్లంలకు చెందిన నవీన్ హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఉదయం గుండెపోటుతో చనిపోయాడు. అతనికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Similar News

News February 19, 2025

ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ BJP: మంత్రి కోమటిరెడ్డి

image

బీజేపీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దురాజ్‌పల్లిలో మాట్లాడుతూ.. ‘ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ.. వాళ్లకు మా గురించి మాట్లాడే అర్హత లేదు, మాది సెక్యులర్ ప్రభుత్వం, మేము అన్ని మతాలను గౌరవిస్తాం, మాకు అన్ని పండుగలు సమానమే, ప్రజలందరికీ సమాన న్యాయం అందించడమే మా ప్రభుత్వ ధ్యేయం, వచ్చే 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతుంది’ అని మంత్రి అన్నారు.

News February 19, 2025

NLG: ఊపందుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఊపందుకున్నది. ఈనెల 27న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. కాగా యూటీఎఫ్ తరఫున మరోసారి బరిలోకి దిగిన నర్సిరెడ్డికి వామపక్షాలు మద్దతిస్తున్నాయి.

News February 19, 2025

NLG: ఇందిరమ్మ ఇండ్లు సరే.. ఇసుకెట్ల..!?

image

రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఇప్పటికే లబ్థిదారుల ఎంపిక కూడా పూర్తయింది. సొంత స్థలం ఉన్నవారి ఖాతాల్లో రూ.5 లక్షల చొప్పున జమ చేయనున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక ఉచితంగా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అయితే.. జిల్లాలో సాగుతున్న ఇసుక దోపిడీతో ఇళ్ల నిర్మాణానికి కూడా దొరికే పరిస్థితి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!