News January 31, 2025
నల్గొండ: గ్రామాన్ని ఖాళీ చేయండి: DE

మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెంను ఫిబ్రవరి 10 వరకు ఖాళీ చేయాలని ఇరిగేషన్ డీఈ కాశీం గ్రామస్థులకు సూచించారు. గురువారం సమావేశం నిర్వహించి వారికి వివరించారు. తమకు పూర్తి నష్ట పరిహారం, R&R ప్యాకేజీ, ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు గ్రామాన్ని ఖాళీ చేసే ప్రసక్తే లేదని గ్రామస్థులు స్పష్టం చేశారు.
Similar News
News November 27, 2025
NLG: రెండు డివిజన్లు.. 117 క్లస్టర్లు!

నల్లగొండ, చండూరు డివిజన్లో పరిధిలో 14 మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు 117 క్లస్టర్లను గుర్తించారు. ప్రతి మూడు నాలుగు గ్రామాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. వారి గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీ చేయాలనుకునే వారు ఆ క్లస్టర్లోనే నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. క్లస్టర్లో రిటర్నింగ్ ఆఫీసర్ తోపాటు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు.
News November 26, 2025
NLG: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష

గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని స్థానిక సంస్థల ఇన్‌ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ అన్నారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు.
News November 26, 2025
నల్గొండ జిల్లాలో నేటి సమాచారం

మునుగోడు: పెట్రోల్ బంకుల్లో తనిఖీ
శాలిగౌరారం: వే2న్యూస్ కథనానికి స్పందన
పెద్దవూర: హైవేపై రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్
నల్గొండ: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.30 లక్షలు: మంత్రి కోమటిరెడ్డి
మిర్యాలగూడలో భారీ ర్యాలీ
నల్గొండ: సర్పంచ్ ఎన్నికల్లో వారిని దింపేందుకు ఫోకస్
నల్గొండ: పల్లెపోరుకు యంత్రాంగం రెడీ
మిర్యాలగూడ: వందే భారత్ రైలుకు అదనంగా 4 బోగీలు
కట్టంగూరు : భక్తులను ఆకట్టుకున్న మల్లన్నమర్రి


