News February 7, 2025
నల్గొండ: గ్రీవెన్స్ డే.. ఇక నుంచి ‘డయల్ యువర్ సైబర్ నేస్తం’

ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో ఇప్పటినుంచి సైబర్ క్రైమ్‌కి సంబంధించిన ఫిర్యాదులు కూడా తీసుకోనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ మేరకు ‘డయల్ యువర్ సైబర్ నేస్తం’ అనే కార్యక్రమాన్ని ఈ సోమవారం నుంచే ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు బాధితులు తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు.
Similar News
News March 23, 2025
NLG: వైజాగ్ కాలనీ కృష్ణా తీరంలో యువకుడి మృతి

నేరేడిగొమ్ము వైజాగ్ కాలనీ కృష్ణా తీరంలో బోడుప్పల్‌కు చెందిన యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. HYDకు చెందిన కొందరు యువకులు ఆదివారం రాత్రి వైజాగ్ కాలనీకి విహారయాత్రకు వచ్చారు. ఉదయం కృష్ణా తీరంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి యువకుడు మృతి చెందాడు. వైజాగ్ కాలనీ బ్యాక్ వాటర్ వద్ద పర్యవేక్షణ ఉండదని, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు.
News March 23, 2025
నల్గొండ జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

నల్గొండ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. MLG, వేములపల్లి, తిప్పర్తి, హాలియా, NDMNR, కనగల్, మునుగోడు, NKL ప్రాంతాల్లో రాత్రి పగలు తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. ప్రశ్నించిన వారిని, ఫిర్యాదు చేసిన వారిని బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నారని అంటున్నారు.
News March 23, 2025
NLG: మహిళా రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

మహిళా రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను మహిళా రైతులకు రాయితీపై అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 13 రకాల యాంత్రీకరణ పరికరాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం జిల్లాకు కోటి 81 లక్షల 36 వేల నిధులను కేటాయించడంతో పాటు 820 వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే మహిళల లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు.