News March 21, 2025
నల్గొండ: గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటిన యువతి

నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరుకి చెందిన పోలగాని నరసింహ గౌడ్, వెంకాయమ్మ దంపతుల కుమార్తె శ్వేత గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటింది. గ్రూప్-1లో 467మార్కులు, గ్రూప్-2లో 412 స్టేట్ ర్యాంక్, గ్రూప్-3లో 272 ర్యాంక్ సాధించింది. 3 నెలల క్రితం గ్రూప్-4 ఉద్యోగం సాధించి అడవిదేవులపల్లి MRO ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. గ్రూప్స్‌లో సత్తా చాటడంతో పలువురు శ్వేతను అభినందిస్తున్నారు.
Similar News
News April 2, 2025
కశింకోట: చెరువులో పడి ట్రాక్టర్ డ్రైవర్ మృతి

కశింకోట మండలం ఉగ్గినపాలెం గ్రామంలో గల చెరువు ఊబిలో కూరుకుపోయి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. ఉగ్గినపాలెం గ్రామానికి చెందిన కె.ఈశ్వరరావు (54) కాలకృత్యాలు తీర్చుకోవడానికి మంగళవారం చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు ఊబిలో చిక్కుకొని మృతి చెందినట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు. భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
News April 2, 2025
రికార్డు సృష్టించిన విజయవాడ రైల్వే డివిజన్

విజయవాడ రైల్వే డివిజన్‌కు 2024- 25 ఆర్థిక సంవత్సరంలో రూ.5,386.61 కోట్ల స్థూల ఆదాయం లభించిందని డివిజన్ రైల్వే మేనేజర్(DRM) నరేంద్ర పాటిల్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు ఓ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధిక ఆదాయమన్నారు. 38.322 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా రూ.4,239.74 కోట్ల ఆదాయం డివిజన్‌కు లభించిందని DRM పేర్కొన్నారు.
News April 2, 2025
ఏపీలో 3 రోజులపాటు తేలికపాటి వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అలాగే గురువారం రాయలసీమ, అల్లూరి జిల్లాలోని కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం ఉత్తరాంధ్ర, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.