News November 17, 2024

నల్గొండ: గ్రూప్‌-3 పరీక్షలు.. ఇవి గుర్తుపెట్టుకోండి!

image

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రూప్‌-3 పరీక్షలకు సంబంధిత అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఒరిజినల్ ఐడీతో పరీక్షకు హాజరుకావాలని, ఉదయం 10 గం. ప్రారంభమయ్యే పేపర్‌-1 పరీక్షకు 8:30 గంటలలోపు, పేపర్-2కి 1:30- 2:30 వరకు పరీక్షా కేంద్రాల్లో హాజరు కావాలన్నారు. మొదటి రోజు పేపర్‌-1 పరీక్షకు తీసుకొచ్చిన హాల్‌టికెట్‌ను మిగతా పరీక్షలకు తీసుకొని రావాలని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

#SHARE IT

Similar News

News November 14, 2025

NLG: నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలు: జిల్లా ఎస్పీ

image

నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా నల్గొండలోని సెయింట్ ఆల్ఫన్స్ పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కంప్యూటర్ యుగంలో యువత చిన్న వయస్సులో మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

News November 14, 2025

NLG: చదువే ధ్యేయంగా బాలికలు ముందుకు సాగాలి: కలెక్టర్

image

బాలికలు చదువునే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకు సాగాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

News November 14, 2025

NLG: చేప పిల్లలు నాసిరకం: మత్స్యకారులు

image

జిల్లాలో చేప పిల్లల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. చెరువులు, కుంటలకు పూర్తిగా నాసిరకం సీడ్‌ వస్తున్నదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 6 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనుండగా.. ఇప్పటివరకు 60 లక్షలకు పైగానే చేప పిల్లలు పంపిణీ చేశారు. జిల్లాలోని ముత్యాలమ్మ చెరువు, కోతకుంట, ఉంగూరుకుంట చెరువులకు పంపిణీ చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉన్నాయని మత్స్యకారులు ఆరోపించారు.