News December 10, 2024
నల్గొండ జిల్లాలో అంగన్వాడీల అరిగోస!
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 4 వేల మంది అంగన్వాడీలు అరిగోస పడుతున్నారు. అరకొర వేతనాలతో కుటుంబం గడవక అష్టకష్టాలు పడుతున్నారు. వచ్చే జీతం మూరెడు బాధ్యతలు మాత్రం బారెడు అన్న చందంగా అంగన్వాడీ కేంద్రం పనులే కాకుండా ఇతర ప్రభుత్వ పనుల ఒత్తిడితో అధిక భారమై సతమతమవుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా అంగన్వాడీల ఒక్క సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 16, 2025
రోడ్డు ప్రమాదంలో నలుగురు భువనగిరి జిల్లా వాసులు మృతి
మహారాష్ట్రలోని షిరిడీ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భువనగిరి జిల్లా వాసులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా, 8 మందికి గాయాలయ్యాయి. మృతులు మోత్కూర్ మున్సిపాలిటీలో పరిధిలోని కొండగడప వాసులుగా తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఆరునెలల చిన్నారి ఉంది. రెండు రోజుల క్రితం వీరు షిరిడీ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం.
News January 16, 2025
NLG: ప్రధాని మోదీతో మచ్చటించిన అంజలి
గుర్రంపోడు మండలం ఆములూరుకు చెందిన కటికర్ల శంకర్ పార్వతమ్మ దంపతుల కుమార్తె అంజలి ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్ష పే చర్చ కార్యక్రమానికి హాజరయ్యింది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అంజలి తన ప్రతిభా పాటవాలతో ఎన్‌సీఈఆర్‌టీ సహకారంతో ఢిల్లీ వెళ్లి ప్రధానితో మోదీతో ముచ్చటించింది. దీంతో ఆములూరు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అంజలిని అభినందించారు.
News January 16, 2025
రాయగిరి: పండగకు వెళ్లి వస్తుండగా విషాదం
WGL- HYD హైవేపై రాయగిరి శివారులో జరిగిన <<15167205>>రోడ్డు ప్రమాదంలో<<>> ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కేసముద్రం మండలం గాంధీపురం గ్రామం వెంకట్రామ్ తండాకు చెందిన భూక్య సంతోష్ తన కుటుంబీకులతో కలిసి పండగకు ఇంటికి వెళ్లి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన భార్య అనూష, కూతురు చైత్ర అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.